Asaduddin Owaisi: బీజేపీ ప్రకారం హిందువులే గాయపడ్డారు: అసదుద్దీన్ ఓవైసీ

by Harish |   (  Updated:2022-04-15 14:21:01  IST  )

జైపూర్: ఏఐఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ..telugu latest news

Asaduddin Owaisi: బీజేపీ ప్రకారం హిందువులే గాయపడ్డారు: అసదుద్దీన్ ఓవైసీ
X

జైపూర్: ఏఐఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీ ప్రకారం కరౌలీ హింసాకాండలో కేవలం హిందువులకే గాయాలయ్యాయని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బీజేపీ పై విరుచుకపడ్డారు. రాజస్థాన్ ప్రభుత్వ మంత్రి ప్రకారం దగ్ధమైన 80 షాపుల్లో 73 ముస్లింలకు చెందినవే. కానీ, బీజేపీ ప్రకారం కరౌలీ ఘటనలో హిందువులే దాడికి గురయ్యారు అని ట్వీట్ చేశారు. కరౌలీలోని ముస్లింలు సంఘ్ నిరసనకారులతో మాత్రమే ఇబ్బంది పడలేదని, పోలీసులు, అధికారుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. కరౌలీ ఘటనకు గెహ్లాట్ ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలని అన్నారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా కరౌలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రభుత్వ భద్రతా వైఫల్యమే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Next Story