- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Abhishek Sharma: వరుస డకౌట్ పై అభిషేక్ శర్మ సంచలన రియాక్షన్
టీ20 ప్రపంచ కప్ లో వరుస డకౌట్లపై అభిషేక్ శర్మ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడే విధానాన్ని (Intent), ప్రిపరేషన్ ప్రాసెస్‌ను ఏమాత్రం మార్చుకోబోనని తేల్చి చెప్పాడు.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ యువ బ్యాటర్ ప్రతిష్ఠాత్మక టోర్నీలో సరిగ్గా రాణించకపోగా.. వరుసగా మూడు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అభిషేక్ శర్మ, తన బ్యాటింగ్ శైలిపై స్పందిస్తూ.. షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలకమైన సూపర్ ఎయిట్ మ్యాచ్‌కు ముందు ఆయన మాట్లాడుతూ.. గత మూడు ఇన్నింగ్స్‌లలో పరుగులు చేయకపోయినా, తన ఆడే విధానాన్ని (Intent), ప్రిపరేషన్ ప్రాసెస్‌ను ఏమాత్రం మార్చుకోబోనని స్పష్టం చేశారు.
రెండేళ్ల క్రితమే తాను ఒత్తిడి తీసుకోవడం మానేశానని, ఫలితం కంటే ప్రాసెస్ మాత్రమే తన చేతుల్లో ఉంటుందని తాను బలంగా నమ్ముతానని అభిషేక్ తేల్చి చెప్పాడు. తన ఇంటెంట్ అన్ని సందర్భాల్లోనూ సానుకూల ఫలితాలను ఇవ్వకపోవచ్చని, కానీ మైండ్‌సెట్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోనని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న క్రికెట్ అభిమానులు.. ప్రస్తుత ఫామ్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఒకవైపు హ్యాట్రిక్ డకౌట్లతో జట్టును కష్టాల్లో నెడుతూ, మరోవైపు తన శైలిని మార్చుకోనని చెప్పడం బాధ్యతారాహిత్యమని నెటిజన్లు మండిపడుతున్నారు. టీమ్ ఇండియా ప్రయోజనాల కంటే వ్యక్తిగత బ్యాటింగ్ శైలికే ప్రాధాన్యత ఇస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తుండగా, వరుస వైఫల్యాల నేపథ్యంలో తదుపరి మ్యాచుల్లో ఆయనను పక్కన పెట్టడమే మంచిదని మరికొందరు సలహా ఇస్తున్నారు. మరికొందరు అభిమానులు మాత్రం ఆయన ఆత్మవిశ్వాసాన్ని సమర్థిస్తూ, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అభిషేక్ తన బ్యాట్‌తోనే విమర్శలకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు.






