- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆప్ రాజ్యసభ నామినేషన్లలో పంజాబ్ కు ద్రోహం: సిద్ధూ ట్వీట్
ఛంఢీగఢ్: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ రాజ్యసభ నామినేషన్లు latest telugu news..

ఛంఢీగఢ్: కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ రాజ్యసభ నామినేషన్లు పంజాబ్ ద్రోహం చేసిందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. మాజీ క్రికెటర్ హర్భజన్ తప్ప, మిగతా నామినేషన్లు అన్ని పంజాబ్‌కు చేసిన ద్రోహమేనని ఆరోపించారు. కాగా, సోమవారమే పంజాబ్ ఐదు రాజ్యసభ స్థానాలకు హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్, రాఘవ్ చద్దా, సందీప్ పటాక్, సంజీవ్ అరోరాలు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. 'ఢిల్లీ రిమోట్ కంట్రోల్ ద్వారా కొత్తవారు వస్తున్నారు.
హర్భజన్ తప్పితే మిగతావారి నామినేషన్లు పంజాబ్ కు ద్రోహం చేయడమే' అని ట్వీట్ చేశారు. కాగా వచ్చే నెల 9తో ఐదుగురు రాజ్యసభ నేతల పదవీ కాలం ముగియనున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ ఖైరా మాట్లాడుతూ ఆప్ ప్రకటించిన ఐదు నామినేషన్లు నిరాశ పరచడమే కాకుండా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముద్రను చూపిస్తున్నాయని ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ పంజాబ్ నుంచి పేరొందిన వ్యక్తులను రాజ్యసభకు పంపివ్వాలని కోరారు.






