స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

స్కూళ్లలో ఆధార్ క్యాంపులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఆధార్ రిజిస్ట్రేషన్, అప్డేట్స్ కోసం పాఠశాలల్లోనే స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. అన్ని స్కూళ్లలో 5 నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులు మొదటి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పూర్తిగా ఉచితం కాగా, రెండవ బయోమెట్రిక్ అప్డేట్ కు మాత్రం రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న ఆధార్ లో ఏవైనా మార్పులు చేయాలి అంటే రూ.75 చెల్లించాలని అధికారులు తెలియజేసారు. ఈ స్పెషల్ ఆధార్ మొబైల్ క్యాంపులు ఎప్పుడు, ఏ స్కూల్లో ఉంటాయో తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ అధికారిని, మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని సూచించారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించారు.

Next Story