అక్కడ పడుకోవడంతో.. ఇంటిని దోచేశారు

by Vinod kumar |   (  Updated:2022-03-21 15:27:45  IST  )

దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని చిన్న నల్లబెల్లి గ్రామంలో - A massive theft has taken place in Khammam district

అక్కడ పడుకోవడంతో.. ఇంటిని దోచేశారు
X

దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని చిన్న నల్లబెల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిన్న నల్లబెల్లి గ్రామానికి చెందిన వూకే చంద్రయ్య వ్యవసాయం తో పాటు కిరాణా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వేసవి కాలం వల్ల ఇంటికి తాళం వేసి, ఇంటి స్లాబ్‌పై భాగంలో కుటుంబ సభ్యులు అందరూ నిద్రపోతున్నారు.


ఈ సమయంలో కొందరు దుండగులు.. ఇంటి వెనక తలుపులు పగులగొట్టారు. ఇంట్లోకి ప్రవేశించి, లోపల ఉన్న ఇనుప బీరువా పగులగొట్టి దానిలో ఉన్న 124 గ్రాముల బంగారు ఆభరణాలు, 100 గ్రాముల వెండి సామాన్లు, ఐదు వేల నగదు, ఒక సెల్ ఫోన్ దొంగతనానికి గురైనట్లు ఉదయం నిద్రలేచిన తరువాత గుర్తించారు. మొత్తం వాటి విలువ రూ. నాలుగు లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.

Next Story