చేపల చెరువులో వ్యక్తి గల్లంతు.. అందుకోసం వెళ్లి

by Javid Pasha |

దిశ, కుత్బుల్లాపూర్ : చేపల చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసులు.. Latest Telugu News..

చేపల చెరువులో వ్యక్తి గల్లంతు.. అందుకోసం వెళ్లి
X

దిశ, కుత్బుల్లాపూర్ : చేపల చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు వెతుకుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చేపల పట్టుకునేందుకు చేపల చెరువుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గండిమైసమ్మ దుండిగల్ మండలం దుండిగల్ తాండ - 1 కు చెందిన జగన్(40) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

మద్యం సేవించి జగన్ స్థానిక తాండ చెరువులో గురువారం ఉదయం చేపల పెట్టేందుకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం నుండి గాలిస్తున్నా ఆచూకి లభించలేదు.

Next Story