- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా కురుస్తున్న వర్షాలు..పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అధికారులు
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పాండిచేరి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పాండిచేరి ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామునుంచే కారైక్కాల్‌లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో నేడు ఆ ప్రాంతంలోన పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెలవు కారైక్కాల్ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
బంగాళాఖాతంలో, ముఖ్యంగా కుమరి సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాతావరణ మార్పుల (Atmospheric Circulation) కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్ష ప్రభావం జనవరి 18 వరకు కొనసాగే అవకాశం ఉందని, ఇప్పటివరకు ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని హెచ్చరించింది. ప్రతికూల వాతావరణం కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు సూచించారు.






