- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీవితంలో ఫెయిలైన వ్యక్తులు తరచుగా చెప్పే 6 విషయాలు?
లైఫ్‌లో ప్రతి వ్యక్తి సక్సెస్ కావాలని కష్టపడుతుంటాడు.

దిశ, వెబ్‌డెస్క్: లైఫ్‌లో ప్రతి వ్యక్తి సక్సెస్ కావాలని కష్టపడుతుంటాడు. కానీ కొంతమంది విజయం సాధిస్తారు. మరికొంతమంది విఫయం అవుతారు. అందరి ఫలితాలు ఒకే విధంగా ఉండవు. పలువురు పదే పదే ఫెయిల్యూర్లను ఎదుర్కొంటారు. దీనికి కారణం వారు కొత్తగా ప్రయత్నించకపోవడమే. కాగా మీకు మీరే ఎంతో కాలంగా అలవర్చుకున్న చెడ్డ ఆలోచనల్ని వదిలేసి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకుండా కించపర్చుకోకుండా క్రియేటివ్ గా ఆలోచించడం నేర్చుకోండి. ఫెయిల్ అయిన వ్యక్తులు తరచుగా చెప్పేవి.. ఓటమి వైపుకు వెళ్లేందుకు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
తరచూ రేపటి నుంచి పని మొదలు పెడతాను అని అంటుంటారు. అలాగే విఫలమ్యే వ్యక్తి ఎప్పుడూ తన తప్పును అంగీకరించడు. అలా అనుకుంటే వారిలోని లోపాలు, బలాలు ఎప్పటికీ గుర్తించలేరు. ఫెయిల్ అయిన వ్యక్తులు ఇతరులతో ప్రతీ పనిని చేయించుకోవడానికి సులభంగా ఫీల్ అవుతుంటారు. ఫిట్ గా, హెల్తీగా ఉండటానికి సమయాన్ని కేటాయించలేరు. పైగా వాటిని సమర్థించుకుంటూ సమయం లేదంటూ మాట్లాడుతారు. విఫలమైనప్పుడు ఏదైనా మళ్లీ కొత్త అవకాశం వచ్చినప్పుడు నా వల్ల కాదు అని అంటారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






