ఇరాన్ ఆందోళనలు.. 30 వేల మంది మృతి!

by Muthe.Rajitha |

ఇరాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇరాన్ ఆందోళనలు.. 30 వేల మంది మృతి!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు వార్తా కథనాలు ప్రచురించాయి. కేవలం జనవరి 8, 9 తేదీల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో దాదాపు 30 వేల మంది వరకు మరణించి ఉండవచ్చని ఇరాన్ ఆరోగ్యశాఖ అధికారుల తెలిపినట్టు రాసుకొచ్చాయి. నిరసనకారులపై భద్రతా బలగాలు తీవ్రంగా దాడులు చేశాయని, మృతదేహాలు ఎక్కువగా ఉండటంతో అంబులెన్సుల బదులు 18 చక్రాల ట్రక్కుల్లో శవాలను తరలించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి.

అయితే ఇరాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో, దేశవ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. దీంతో నిరసనకారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. మరోవైపు ప్రభుత్వం జనవరి 21న విడుదల చేసిన లెక్కల ప్రకారం 3,117 మంది మాత్రమే చనిపోయారని చెబుతోంది. కానీ ఈ సంఖ్య 10 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

Next Story