స‌ముద్రంలో వాటిని తిన‌డానికి, కొత్త‌గా దీన్ని సృష్టించిన శాస్త్ర‌వేత్త‌లు

by Disha Web Desk 20 |
స‌ముద్రంలో వాటిని తిన‌డానికి, కొత్త‌గా దీన్ని సృష్టించిన శాస్త్ర‌వేత్త‌లు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః హ‌రించేవాడు సృష్టించేవాడు ఒక‌డే అన్న‌ట్లు సాంకేతిక అభివృద్ధితో పాటు పెరిగిన కాలుష్యాన్ని సాంకేతిక‌త‌తోనే క్లీన్ చేయాల‌నుకుంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. ఈ క్ర‌మంలో, మహాసముద్రాల నుండి మైక్రోప్లాస్టిక్‌లను తొలగించడానికి శాస్త్రవేత్తలు ఒక చిన్న రోబోట్-చేపను రూపొందించారు. 13-మిల్లీ మీట‌ర్ల‌ పొడవున్నఈ చేప స‌ముద్రంలో త‌న చుట్టూ తాను ఈదుతుంది. త‌ద్వారా అక్క‌డున్న సూక్ష్మ‌ప్లాస్టిక్ ముక్క‌లను దాని శరీరంతో పీల్చుకుంటుంది. ఈ రోబో చేప ప్రత్యేకత ఏంటంటే, దాని శరీరం మృదువుగా, ఈత‌కు అనువైనదిగా ఉంటుంది. అలాగే, త‌న‌ను తాను రిపేర్ చేసుకోగ‌ల‌దు కూడా. అంతేనా, ఇది సొంత‌గా ఈద‌గ‌ల‌దు. దాని తోకలో తేలికపాటి లేజర్ వ్యవస్థ సహాయంతో, చేప సెకనుకు దాదాపు 30 మి.మీ వేగంతో ఈత కొట్టగలదు. కదిలే నీటిలో పాచి అంతా ఒక‌చోట‌కి చేరుకోడానికి ఎంత వేగం అవ‌స‌ర‌మే అంత వేగంతో ప్ర‌యాణిస్తుంది.

మదర్-ఆఫ్-పెర్ల్, నాక్రే వంటి సముద్రంలో లభించే మూలకాలచేత‌ ప్రేరణ పొందిన పదార్థాల నుండి రోబో-చేప సృష్టించిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. అధ్యయనం ప్రకారం ఈ చేప‌ 5 కిలోల వరకు బరువును లాగగలదు. "జల వ‌నరుల నుండి హానికరమైన మైక్రోప్లాస్టిక్ కాలుష్య కారకాలను సేకరించి, శాంపిల్‌ చేయడానికి రోబోట్‌ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. మాకు తెలిసినంత వరకు, ఇటువంటి సాఫ్ట్ రోబోట్‌ల‌లో ఇదే మొదటి ఉదాహరణ" అని సిచువాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పాలిమర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుడు యుయాన్ వాంగ్ అన్నారు. 'నానో లెటర్స్' జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రధాన రచయితలలో వాంగ్ ఒకరు. అలాగే, ఇది చేప ప్రపంచంలో అధ్వాన్నంగా మారుతున్న మైక్రోప్లాస్టిక్ సమస్యను పరిష్కరించడంలో కీల‌క సహాయం అందిస్తుంద‌ని తెలిపారు.


Next Story

Most Viewed