నీటిపై 3.5 గంటల తేలియాడిన చిన్నారి.. ఆసియా బుక్ రికార్డ్స్‌లో చోటు

by Disha Web Desk 16 |
నీటిపై 3.5 గంటల తేలియాడిన చిన్నారి.. ఆసియా బుక్ రికార్డ్స్‌లో చోటు
X

దిశ, ఫీచర్స్ : కేరళ, అలువాకు చెందిన 10 ఏళ్ల అవంతిక చంద్రన్.. 30 అడుగుల లోతున్న పెరియార్ నదిలో దాదాపు మూడున్నర గంటల పాటు తేలుతూ అసాధారణ ఫీట్ చేసింది. కాగా పెరియార్ వంటి నదిలో తేలడం అంత తేలికైన పని కాదంటున్న నిపుణులు.. ఆ చిన్నారి సాహసాన్ని అభినందిస్తున్నారు.

భారీ అండర్‌కరెంట్స్ ఉన్న నదిలో తేలుతున్నప్పుడు ఆమె ఎటువంటి సేఫ్టీ గేర్‌ను ధరించకపోవడం అవంతిక ధైర్యానికి నిదర్శనమని అవంతిక తల్లి డాక్టర్ చిత్ర బోస్ అన్నారు. ఈ ఫీట్‌ను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించాయని ఆమె చెప్పారు. ఎంతోమంది వికలాంగులు, చిన్నారులు, మహిళలకు శిక్షణనిచ్చిన సాజీ వలస్సేరి ఆధ్వర్యంలో ఈ ఏడాది మార్చి 28న అవంతిక తన తొలి స్విమ్మింగ్‌ పాఠాలు నేర్చుకుంది. ఈ మేరకు మే 14న నదిలో 780 మీ. దూరం ఈదగలిగింది. అయితే అంతకుమించి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. పిల్లలు నీళ్లలో మునిగిపోవడంపై వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను చూసిన అవంతిక.. నీటిపై తేలగిలిగే టెక్నిక్‌ ఉపయోగించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రజలకు చూపించాలనుకుంది. అందుకోసమే ఈ ఫీట్ చేసి రికార్డ్స్ కొల్లగొట్టడంతో పాటు అందరి ప్రశంసలు అందుకుంది. ఇక కరాటే, కథాప్రసంగం, పారాయణం, వక్తృత్వంలోనూ అవంతికకు ప్రవేశం ఉండటం విశేషం.

Next Story

Most Viewed