రుద్రంగిలో చిరుత కలకలం.. గేదె దూడపై దాడి

by Anjali |
రుద్రంగిలో చిరుత కలకలం.. గేదె దూడపై దాడి
X

దిశ రుద్రంగి: రుద్రంగిలో చిరుతపులి కలకలం గోరిలాల్వ నల్లగుంట ప్రాంతంలోని చిట్టపురం గంగధర్ అనే రైతుకు చెందిన గేదెదూడపై చిరుతపులి దాడి చేసి చంపింది. రైతు గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ గేదె దూడను గుడిసెలో కట్టేసి ఉంచామని రాత్రి సమయంలో చిరుత దాడి చేసి చంపిందని గుడిసె చుట్టూ చిరుత కాలి వెలిముద్రలు కనిపించాయని తెలిపాడు. సంవత్సరం పాటు కపాడుకున్న లేగా దూడను చిరుత చంపడంతో రైతు ఆవేదనకు గురయ్యాడు. నల్లగుట్ట ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందని ఆ ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story

Most Viewed