గుడ్ న్యూస్: తెలంగాణలో ఆ విద్యార్థులకు పరీక్షలు లేవ్

by  |
గుడ్ న్యూస్: తెలంగాణలో ఆ విద్యార్థులకు పరీక్షలు లేవ్
X

దిశ,వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభించింది. తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ వైరస్ ప్రభావం ముఖ్యంగా విద్యార్థుల చదువు మీద పడుతుంది. ఇప్పటీకే కరోనా ప్రభావం వలన గతేడాది నుండి విద్యార్థులు చదువుకు దూరమయ్యారు.ఇక ఈ మధ్యనే పాఠశాలలు మొదలవ్వడం .. క్లాసులు జరగడం జరుగుతుండగానే మరోసారి కరోనా ప్రభావం పాఠశాలలపై పడింది. స్కూల్సే టార్గెట్ గా కరోనా మహమ్మారి విద్యార్థుల పాలిట శాపంలా తయారయ్యింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో 1 నుండి 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను ప్రమోట్ చేసి పై తరగతులకు పంపాలని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

గతేడాది 9 తరగతి విద్యార్థులను ఇలాగే 10 వ తరగతి కి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అంతేకాకుండా 6,7,8,9 వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు. ఇక 10 వ తరగతి విద్యార్థులకు మాత్రం బోర్డు పరీక్షలు ఉన్న కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రత్యేక్ష బోధన అందించనున్నట్లు తెలుస్తుంది. వీటిపై సీఎం కేసీఆర్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

Next Story