తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88-90 సీట్లు.. మంత్రి ధీమా

by Dishafeatures2 |
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88-90 సీట్లు..  మంత్రి ధీమా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తోన్నాయి. పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే విషయంపై అనేక సంస్థల ప్రీ పోల్ సర్వేలు వెలువడుతున్నాయి. ఇక రాజకీయ పార్టీలు కూడా గెలుపుపై అంచనా వేసుకుంటున్నాయి. ఎవరికి వారు గెలుపు తమ పార్టీదేనని చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం పక్కా అని గులాబీ శ్రేణులు చెబుతుండగా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని హస్తం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ క్రమంలో రానున్న ఎన్నికలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88 నుంచి 90 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తారు. కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరుగుతుందని, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. మంగళవారం ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పువ్వాడ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపీ కొడుతుందని ఆరోపించారు.


Next Story