బీఆర్ఎస్‌లో నెంబర్ 2 ఎవరు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కొత్త టెన్షన్..?

by Disha Web Desk 19 |
బీఆర్ఎస్‌లో నెంబర్ 2 ఎవరు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు కొత్త టెన్షన్..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార బీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ ఎంత చెబితే అంత. అందరూ ఆయన మాటకు కట్టుబడి ఉండాల్సిందే. అయితే.. అధినేత తర్వాత పార్టీలో నెంబర్ టూ ఎవరు అనేదానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, ఈటల అని లిస్ట్ ఉండేంది.

ఈటల పార్టీ నుండి సస్పెండ్ కావడం.. లిక్కర్ స్కాంలో కవిత పేరు ప్రధానంగా ఉండడంతో సెకండ్ ప్లేస్‌పై మళ్లీ చర్చకు వచ్చింది. సమస్యలను చెప్పుకునేందుకు.. టికెట్ కన్ఫర్మ్ చేసుకునేందుకు ఎవరిని సంప్రదించాలో తెలియక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కేటీఆర్‌‌ను కలిస్తే హరీశ్‌కు కోపమొస్తుందోనని డైలామాలో ఉండిపోతున్నారు.

నెంబర్ టూ ఎవరు..?

గులాబీ పార్టీలో కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరిది కీలక స్థానం. ప్రభుత్వంలోనూ ముఖ్యమైన శాఖలను నిర్వర్తిస్తున్నారు. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలోనూ ఎవరికి వారే సాటి. అయితే.. మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అయినప్పటికీ గ్రౌండ్ లెవల్‌లో హరీశ్ ‌రావుకు ఉన్న పరిచయాలు, పలకరింపు తీరు కేటీఆర్‌కు లేవనేది సొంత పార్టీ నేతలే చెప్పుకుంటుంటారు.

సంక్షోభాల నుండి అనేక సందర్భాల్లో పార్టీని గట్టెక్కించిన హరీశ్‌రావుకు ట్రబుల్ షూటర్‌గా పేరుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సెకండ్ బాస్ ఎవరనే దానిపై జోరుగా చర్చ మొదలైంది. కేసీఆర్ రాజకీయ వారసత్వం అల్లుడికి దక్కుతుందా.. కొడుకుకు వస్తుందా అనే విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని సమాచారం.

Read More : KTR Birthday : నేతల్లో తీవ్ర నిరాశకు కారణమిదే?



Next Story

Most Viewed