KTR Birthday : నేతల్లో తీవ్ర నిరాశకు కారణమిదే?

by Disha Web Desk 4 |
KTR Birthday :  నేతల్లో తీవ్ర నిరాశకు కారణమిదే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, ఆయన అభిమానుల సందడి వాతావరణం నిన్నటి నుంచే మొదలైంది. సామాజిక మాధ్యమలల్లో ఎక్కడ చూసినా కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ కోనసాగుతుంది. ఇవాళ కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదానాలు, రక్తదానాలు వంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ను నేరుగా శుభాకాంక్షలు చెప్పేందుకు నేతలు ఎంతో మంది తెలంగాణ భవన్‌కు వెలుతున్నారు.

మరో వైపు కేటీఆర్ ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి శుభాకాంక్షలు తెలిపేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌ను నేరుగా కలిసి శుభాకాంక్షలు చెబుదామన్న నేతలకు నిరాశ ఎదురైంది. దీంతో ఆ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలే అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్ది ఎమ్మెల్యేల్లో, ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకుందాం అనుకున్న వారికి మంత్రి అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ టూర్‌లో ఉండడంతో ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed