- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహినూర్ గ్రూప్స్ MD మజీద్‌ఖాన్ ఇంట్లో IT దాడులు
by GSrikanth |
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు పంజా విసిరారు. బడా వ్యాపారులే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామునుంచే పాతబస్తీలోని ప్రముఖుల ఇళ్లలో దాడులు జరుపుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారులు పంజా విసిరారు. బడా వ్యాపారులే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామునుంచే పాతబస్తీలోని ప్రముఖుల ఇళ్లలో దాడులు జరుపుతున్నారు. ముఖ్యంగా కోహినూర్ గ్రూప్స్ MD మజీద్‌ఖాన్ ఇళ్లు, కార్యలయాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. అంతేకాకుండా.. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వహిస్తున్న ఈ వ్యాపారులు ఓ రాజకీయ పార్టీకి భారీగా ఫండింగ్ చేస్తున్నట్లు అనుమానం రావడంతో దాడులకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






