మహిళలను ఉద్దరించే ఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేదు: సీపీఎం

by Disha Web Desk 2 |
మహిళలను ఉద్దరించే ఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేదు: సీపీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమల్లోకి వచ్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలు చేయడమంటే ఎన్నికల్లో లబ్ధికోసమే మహిళా బిల్లును తెచ్చినట్టుగా ఉందన్నారు. మహిళలను ఉద్దరించే ఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఉండాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కొత్త పార్లమెంట్‌ను రాష్ట్రపతి చేత ప్రారంభించకపోవడంపై మండిపడ్డారు. రాజ్యాంగ పీఠిక గుండెకాయలాంటిదని అన్నారు. అందులో నుంచి సామ్యవాదం, లౌకికవాదం పదాలను ఎలా తొలగిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందూరాజ్యంగా చేయడం కోసమే బీజేపీ ఇలాంటివి చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లో ఓటమిపాలవుతుందన్నారు. అంగనవాడీ కార్మికులపై పోలీసులు దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. సమ్మె చేస్తే కొడతారా? అని ప్రశ్నించారు. సమ్మె చేస్తే ఉద్యోగంలోకి తీసుకోబోమంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు. ఉద్యమాల ద్వారా ఏర్పడిన తెలంగాణలో ఉద్యమాలు చేస్తున్న వారిని అణచివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంఐఎంతో కేసీఆర్‌కు నుంచి సఖ్యత ఉందన్నారు.


Next Story

Most Viewed