HYD: సుధీర్ రెడ్డికి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు: మధుయాష్కి

by Disha Web Desk 2 |
HYD: సుధీర్ రెడ్డికి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు: మధుయాష్కి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డికి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం చీఫ్​ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌ను కలిసి సుధీర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో ఎలాంటి వారెంట్ లేకుండా తన ఇంటిపై దాడి చేయడం ఏమిటని? ప్రశ్నించారు. తనతో పాటు కుటుంబ సభ్యులను భయ బ్రాంతులకు గురి చేశారన్నారు. ఇళ్లు, ఆఫీస్‌లపై పోలీసులు ఇష్టారీతిలో దాడులు చేశారన్నారు. ఎలక్షన్ కోడ్ సమయంలో అధికారులు ఈసీ పరిమితులు, మార్గదర్శకాల ప్రకారం పనిచేయాల్సి ఉంటుందని, కానీ పోలీసులు బీఆర్ఎస్ చెప్పినట్లు ముందుకు పోతున్నారని ఆరోపించారు.

ఇప్పటికే జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తాను మాజీ ఎంపీని అని, ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని తనపై పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. సోదాలు నిర్వహించిన వనస్థలిపురం ఏసీపీ భీమ్ రెడ్డి, హయత్ నగర్ సీఐ వెంకటేశ్వర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు పనిచేయడం విచారకరమన్నారు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పాతళంలోకి వెళ్లడం ఖాయమని ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed