పోలింగ్ ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
పోలింగ్ ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎన్నికలకు 36 వేల ఈవీఎంలు సిద్ధం చేశామని చెప్పారు. 86 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశామని ఎల్లుండి వరకు పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తామన్నారు. గురువారం మీడియాతో ఎన్నికల ఏర్పాట్లను వెల్లడించారు. రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నారని, ఈసారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ముద్రించి పంపిణీ చేశామన్నారు.

60 మంది వ్యయ పరిశీలకులను నియమించామన్నారు. రాష్ట్ర స్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లు ఉన్నారని ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక అబ్జర్వర్‌ను నియమించినట్లు తెలిపారు. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవల్లో పనిచేసేవారు ఈ మూడు కేటగిరీల వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించామని ఇప్పటికే 9 వేలకు పైగా ఓటర్లు హోం ఓటు హక్కు వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed