రాష్ట్రంలో మూడో స్థానానికి కాంగ్రెస్ పరిమితం

by Disha Web Desk 2 |
రాష్ట్రంలో మూడో స్థానానికి కాంగ్రెస్ పరిమితం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధరణి పోర్టల్ అతి పెద్ద స్కామ్ అని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఆరోపించారు. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన జవదేకర్.. ధరణి పోర్టల్ నిర్వహణ ప్రైవేట్ కంపెనీకి ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ నిర్వహణకు తొలుత టీసీఎస్‌కు ఇచ్చి ఆ తర్వాత ఐఎల్ఎఫ్ఎస్ అప్పగించారని, చివరకు టెర్రాస్ సీఐఎస్ వచ్చిందన్నారు. వ్యక్తుల వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ సంస్థ టెర్రాస్ సీఐఎస్ చేతిలోకి చేరిందన్నారు.

ధరణిలో ఉన్న లోపాలపై ఎటువంటి ఫిర్యాదులు తీసుకోవం లేదని ఇందుకోసం బీజేపీ ఈమెయిల్, వాట్సాప్‌ల ద్వారా ధరణి బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. [email protected] [email protected], లేదా 9391936262, 7330861919 నెంబర్లకు వాట్సాప్ ల ద్వారా ఫిర్యాదు చేస్తే అలాంటి వారికి బీజేపీ సర్కార్ వచ్చాక న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నది కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.


Next Story