గుడిబండ యూనియన్ బ్యాంకు ఏటీఎంలో చోరీ...

by Disha Web Desk 11 |
గుడిబండ యూనియన్ బ్యాంకు ఏటీఎంలో చోరీ...
X

దిశ, కోదాడ : కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఏటీఎం చోరీ కలకలం శనివారం రాత్రి చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు, బ్యాంకు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం సెలవు కావడంతో ఏటీఎంలో 10 లక్షలు నగదు పెట్టి అధికారులు వెళ్లిపోయారు. కాగా వినియోగదారులు వివిధ అవసరాల నిమిత్తం 1,82,000 రూపాయల నగదును డ్రా చేశారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఓ ఘరానా దొంగ ఏటీఎంలోకి చొరబడ్డాడు. గ్యాస్ కట్టర్ తో కట్ చేసి డబ్బులు బయటికి తీసే క్రమంలో, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎనిమిది లక్షల 12 వేల రూపాయలు ఖాళీ బూడిద అయిపోయాయని తెలిసింది. కట్టర్ వినియోగించే క్రమంలోనే ఈ షార్ట్ సర్క్యూట్ ఏర్పడిందని పోలీసులు భావిస్తున్నారు.

దొంగ ఏటీఎంలోకి ముందుగా ప్రవేశించిన సమయంలో అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలపై గ్యాస్ కట్టర్ తో స్ప్రే చేయడంతో విజువల్స్ కనపడకుండా పోయాయి. ఏటీఎం ఓపెన్ చేసే క్రమంలో డేంజర్ సైరన్ సైతం కట్టర్ తో కట్ చేయడంతో డేంజర్ సౌండ్ కూడా బయటికి రాకుండా దొంగ జాగ్రత్త పడ్డాడు. బ్యాంక్ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. భారీ మొత్తంలో నగదు కాలిపోవడంతో మిగతా ఏటీఎంలో పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు.

Next Story

Most Viewed