- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీకి షర్మిల బర్త్ డే విషెస్.. మరింత ఇంట్రెస్టింగా మారిన విలీన వార్తలు!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల బర్త్ డే విషెస్ చెప్పారు.ఈ రోజు మీకు సంతోషకరమైన అద్భుతమైన రోజు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ పట్టుదల, సహనంతో నిత్యం ప్రజలకు అలాగే స్పూర్తివతంగా ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని కోరారు. ఈ ఏడాది మరింత మంచి ఆరోగ్యం, ఆనందంతో పాటు మరెన్నే గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అయితే వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ షర్మిల చేసిన ఈ ట్వీట్ ఆసక్తిగా మారింది. తన పార్టీ విలీనంపై ఇప్పటికే పలు దఫాలుగా కాంగ్రెస్ పెద్దలతో, కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్ ద్వారా షర్మిల రాయబారం పంపిందని అన్ని సజావుగా జరిగితే త్వరలోనే కాగ్రెస్‌లోకి షర్మిల రావడం ఖాయం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.






