Indian Youth Congress : యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే.. సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అయిన యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

TPCC Chief Revanth Reddy Slams CM KCR Over Food in Welfare Hostels
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అయిన యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 139 ఏళ్లుగా ప్రతి జనరేషన్ కొత్త రక్తాన్ని కాంగ్రెస్ నుదుటి తిలకంగా దిద్దుతోందని తెలిపారు. ఈ దిగ్విజయ ప్రస్థానంలో కీలకమైన యువతరానికి యూత్ కాంగ్రెస్ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు అంటూ వెల్లడించారు.

కాగా, వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. పౌరుల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడి మార్పుకు నాయకత్వం వహిస్తున్న సంస్థ యొక్క లక్షలాది క్రియాశీల కార్యకర్తలకు వందనం అంటూ యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ తెలిపారు. కాగా, అధికారికంగా యూత్ కాంగ్రెస్ 1960లో స్థాపించారు. అంతకు ముందు జాతీయ ఉద్యమంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాదాపు 50 మిలియన్ల మంది ఇందులో సభ్యత్వం తీసుకున్నారు.

Next Story