బంజారాహిల్స్‌లో యువతి హల్‌చల్.. AIG ఆసుపత్రి బిల్డింగ్ పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌(Hyderabad)లోని బంజారాహిల్స్‌లో యువతి హల్‌చల్ చేసింది. ఏఐజీ ఆసుపత్రి(AIG Hospital) బిల్డింగ్ పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది.

బంజారాహిల్స్‌లో యువతి హల్‌చల్.. AIG ఆసుపత్రి బిల్డింగ్ పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లోని బంజారాహిల్స్‌లో యువతి హల్‌చల్ చేసింది. ఏఐజీ ఆసుపత్రి(AIG Hospital) బిల్డింగ్ పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఆ యువతిని కిందకు దించడానికి పోలీసులు(Banjara Hills Police) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కిందకు దిగాలని, సమస్య ఏంటో చెప్పాలని ఆసుపత్రి సిబ్బందితో పాటు, పోలీసులు ఎంత వేడుకున్నా చెప్పకుండా అలాగే నిల్చొని చూస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఐజీ ఆసుపత్రి బిల్డింగ్‌లో సదరు యువతి కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సడన్‌గా ఆమెను విధుల్లోంచి తొలగించడంతో తట్టుకోలేక ఆత్మహత్యయత్నానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story