- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
by Naga Rani Yarlagadda |
తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్నిప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసిన వాతావరణ కేంద్రం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నేడు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని తెలిపింది. రేపు (జూన్ 24) ఈ జిల్లాలతో పాటు నిజామాబాద్ లోనూ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంటూ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Next Story






