రికార్డ్ స్థాయిలో యాసంగి ధాన్యం సేకరణ

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ధాన్యం దిగుబడి సంచలన రికార్డు నమోదు చేసుకుందని, గత ప్రభుత్వంతో పొల్చుకుంటే 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈప్రభుత్వం కొనుగోలు చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

రికార్డ్ స్థాయిలో యాసంగి ధాన్యం సేకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ధాన్యం దిగుబడి సంచలన రికార్డు నమోదు చేసుకుందని, గత ప్రభుత్వంతో పొల్చుకుంటే 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈప్రభుత్వం కొనుగోలు చేసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ధాన్యం కొనుగోళ్ల పై సంబందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్​పాలన చివరి జూన్ 8 నాటికి నాటికి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. వానా కాలం సీజన్ లో రికార్డు స్థాయిలో దిగుబడి అయిన ధాన్యం పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రస్తుత వానాకాలం సీజన్ లో సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అదనంగా 1,344 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు.

2023 యాసంగి సీజన్ లో నాటి ప్రభుత్వం 7,034 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి జూన్ 8 నాటికి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే మా ప్రభుత్వం అదే యాసంగి సీజన్ లో 8,378 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. అదే విదంగా ధాన్యం కొనుగోలు చేసిన 12.33 లక్షల మంది రైతులకు తమ సర్కార్​రూ. 15,121 కోట్లు చెల్లించామన్నారు. అదే గత యాసంగి సీజన్ లో అప్పటి ప్రభుత్వం 9.81 లక్షల మంది రైతుల వద్ద ధాన్యం సేకరణ చేసి రూ. 5,982 కోట్లు చెల్లించిందన్నారు. చెల్లింపులలో కూడా బీఆర్​ఎస్​హయాంలో యాసంగి సీజన్ లో జూన్ 8 నాటికి కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రస్తుత ప్రభుత్వం 9,139 కోట్లు అధికంగా చెల్లించామన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా 2023 యాసంగి సీజన్ తో పోల్చుకుంటే అదనంగా 1,344 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలబడిందన్నారు. గత పాలకులు గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం నిరుపయోగంగా మారినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరించిన విధానాలతో చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి చేసుకోవడం వ్యవసాయ చరిత్రలోనే చరిత్రాత్మక ఘట్టంగా నిలిచి పోతుందన్నారు.

Next Story