- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదగిరిగుట్ట హుండీ కాసుల గలగల..
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. గత 28 రోజులకు సంబంధించి భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్న కానుకలను మంగళవారం దేవస్థాన అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపులో స్వామివారికి భారీగా నగదుతో పాటు బంగారం, వెండి విరాళాలు అందినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి భవాని శంకర్ ప్రకటనలో తెలిపారు.
రూ.కోటి 86 లక్షల నగదు..
గత 28 రోజుల కాలానికి గాను హుండీ ద్వారా మొత్తం రూ. 1,86,44,511 (ఒక కోటి ఎనబై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదువందల పదకొండు రూపాయలు) నగదు ఆదాయం లభించింది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు కావడంతో భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. స్వామివారికి 57.500 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 750 గ్రాముల మిశ్రమ వెండిని సమర్పించారు. కొండపై ఉన్న హుండీ లెక్కింపు హాల్‌లో సిబ్బంది, బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది.
కిటకిటలాడిన విదేశీ కరెన్సీ..
యాదగిరి నరసింహుడికి విదేశీ భక్తుల తాకిడి కూడా పెరిగినట్లు హుండీ ఆదాయం స్పష్టం చేస్తోంది. అమెరికా: 329 డాలర్లు, వియత్నాం: 3,01,000 డోంగ్స్, హాంకాంగ్: 510 డాలర్లు, కెనడా: 160 డాలర్లు, ఇంగ్లాండ్ (40 పౌండ్స్), ఇండోనేసియా (1000), సౌత్ ఆఫ్రికా (50), ఆస్ట్రేలియా, యూరోప్, మలేషియా వంటి పలు దేశాల కరెన్సీ నోట్లు హుండీలో లభించినట్లు అధికారులు వెల్లడించారు.






