- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రచయిత అందెశ్రీ హఠాన్మరణం.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇవాళ హైదరాబాద్‌లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అందెశ్రీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అందెశ్రీ హఠాన్మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిపించాలని సీఎస్ రామకృష్ణా రావును ఆదేశించారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లను సమీక్షించాలని అధికార యంత్రాంగానికి సూచించారు.
Next Story






