- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం జాతరలో చిన్నారుల కోసం రిస్ట్ బ్యాండ్లు
మేడారం మహాజాతరకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారులు, విద్యాంగుల రక్షణ కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నారులు, దివ్వాంగులు తప్పిపోయే ప్రమాదం ఉంది.

దిశ, వెబ్ డెస్క్: మేడారం మహాజాతరకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చిన్నారులు, విద్యాంగుల రక్షణ కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నారులు, దివ్వాంగులు తప్పిపోయే ప్రమాదం ఉంది. దీంతో అలా జరగకుండా చిన్నారుల కోసం రిస్ట్ బ్యాండ్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం చిల్డ్రన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ బ్యాండ్ కు ఓ క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ఒకవేళ చిన్నపిల్లలు తప్పిపోయినట్లయితే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారి తల్లి దండ్రులకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. కాబట్టి చిన్నారులు తప్పిపోయినా కంగారు పడకుండా వెంటనే గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 28 నుండి 31వ తేదీ వరకు 11 కేంద్రాల్లో ఈ బ్యాండ్లను పంపిణీ చేయనున్నారు. వీటిని హన్మకొండ, కరీంనగర్, మంథని, ఉప్పల్,పరకాల, ఏటూరునాగారం.ఎంజీబీఎస్,పెద్దపల్లి,కాటరం బస్టాండ్లు, వరంగల్, కాజీపేట్ రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. పంపిణీ కేంద్రాల వద్దనే సంరక్షుల సమాచారం తీసుకుంటారు. దీని కోసం మొత్తం 25వేల రిస్ట్ బ్యాండ్లను అందుబాటులో ఉంచారు.






