కేటీఆర్‌కు రాఖీ కట్టి కన్నీరు పెట్టుకున్న మహిళలు.. అసలు ఏం జరిగిందంటే?

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-08 15:38:57  IST  )

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు కొడంగల్ నుండి వచ్చిన గిరిజన సోదరీమణులు రాఖీ(Rakhi) కట్టారు.

కేటీఆర్‌కు రాఖీ కట్టి కన్నీరు పెట్టుకున్న మహిళలు.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు కొడంగల్ నుండి వచ్చిన గిరిజన సోదరీమణులు రాఖీ(Rakhi) కట్టారు. ప్రభుత్వం తమ వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు, తమకు ఒక అన్నలా అండగా నిలిచిన కేటీఆర్‌కు ఈ రాఖీ కట్టామని వారు తెలిపారు. కొడంగల్ మండలం లగచర్ల గ్రామం రోటిబండ తండాకు చెందిన జ్యోతి, మరికొంత మంది మహిళలు శుక్రవారం కేటీఆర్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. లగచర్ల భూ పోరాటం సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు దౌర్జన్యం చేశారని, ఆమె భర్తను జైలుకు పంపిన సమయంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలు కమిషన్లకు ఫిర్యాదులు చేసి, జ్యోతితోపాటు లగచర్ల గిరిజనులకు, పేద రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ వేదికగా ఎండగట్టారు. దీని ఫలితంగా, ప్రభుత్వం భూసేకరణను వెనక్కి తీసుకుందని వారు తెలిపారు. కేసుల కారణంగా జైలుపాలైన లగచర్ల సోదర సోదరీమణులందరికీ కేటీఆర్ అన్నగా అండగా నిలబడి, న్యాయ సహాయం అందించారని, అందరినీ జైలు నుంచి విడిపించారని వారు తెలియజేశారు. రాఖీ కట్టిన సందర్భంగా జ్యోతి భావోద్వేగానికి గురయ్యారు. కేటీఆర్ తనకు దేవుడిచ్చిన సోదరుడని ఆమె అన్నారు.

Next Story