ప్రాణం తీసిన లిఫ్ట్.. ప్రాణాపాయంలో బాలుడు

by Naga Rani Yarlagadda |

ఖైరతాబాద్ లోని ఓ అపార్టుమెంట్ లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి చెందింది.

ప్రాణం తీసిన లిఫ్ట్.. ప్రాణాపాయంలో బాలుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఖైరతాబాద్ లోని ఓ అపార్టుమెంట్ లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. తన మనవడితో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు ఇద్దరూ లిఫ్ట్ గుంతలో పడిపోయారు. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్లోనే మరణించగా.. ఆమె మనవడికి తీవ్రగాయాలయ్యాయి. అపార్ట్మెంట్ సెక్యూరిటీ వెంటనే అప్రమత్తమై మిగతావారిని అలర్ట్ చేయగా.. బాలుడిని గుంతలో నుంచి బయటికి తీశారు. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. లిఫ్ట్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు ఆరోపిస్తున్నారు.

Next Story