తెలంగాణ సచివాలయం అండర్‌ వెహికిల్‌ స్కానర్‌లో ఇరుక్కున్న మహిళా కాలు

by Malleboina Mahesh |

తెలంగాణ సచివాలయం వద్ద ఈరోజు సాయంత్రం అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

తెలంగాణ సచివాలయం అండర్‌ వెహికిల్‌ స్కానర్‌లో ఇరుక్కున్న మహిళా కాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయం వద్ద ఈరోజు సాయంత్రం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సచివాలయ ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటు చేసిన అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్‌లో ఒక మహిళా కాలు ఇరుక్కుపోవడంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ తనిఖీల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రిల్‌ పై నుంచి వెళ్లిన సమయంలో ఆమె కాలు లోపలికి జారి చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడ భద్రతా సిబ్బంది స్పందించి మహిళలకు సహాయం అందించారు. స్కానర్ గ్రిల్ చాలా బలంగా ఉండటంతో, సాధారణంగా బయటకు తీయడం సాధ్యం కాకపోవడంతో SPF సిబ్బంది ప్రత్యేక పరికరాలను తెప్పించి గ్రిల్‌ను కట్టింగ్ చేసి, ఆమె కాలును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, ఆమెను వెంటనే వైద్య పరీక్షలకు తరలించినట్లు సమాచారం.

Next Story