మిక్చర్ ప్యాకెట్లో బల్లి.. లులూ మాల్ బాగోతాన్ని బయటపెట్టిన యువతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-16 12:52:17  IST  )

లులూ మాల్ లో కొన్న మిక్చర్ ప్యాకెట్లో బల్లి రావడంతో ఓ మహిళ సోషల్ మీడియాలో ఆవేదన చెందుతూ వీడియో పోస్ట్ చేసింది.

మిక్చర్ ప్యాకెట్లో బల్లి.. లులూ మాల్ బాగోతాన్ని బయటపెట్టిన యువతి
X

దిశ, వెబ్‌‌‌‌డెస్క్ : సాధారణంగా మనం గ్రోసరీస్ కోసం ఏదైనా మార్ట్ కు వెళ్తే.. వాటితో పాటు పిల్లలకోసం లేదా మనకోసం స్నాక్స్ కూడా ఎక్స్ ట్రా కొంటుంటాం. కూకట్ పల్లిలో ఉన్న లులూ హైపర్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గ్రోసరీస్, డ్రైఫ్రూట్స్, వెజిటబుల్స్, నాన్ వెజ్, పికిల్స్, ఫ్రూట్స్ తో పాటే.. ఫుడ్ కోర్ట్, కేకులు, ఇతర స్నాక్స్ కూడా అక్కడే ఉంటాయి. ఆల్ వన్ లాగా ఉండే లులూ మార్కెట్ కు జనాలు ఇట్టే అట్రాక్ట్ అవుతారు. ఒకే ప్లేస్ లో ఇన్ని దొరుకుతుంటే.. పని ఈజీగా అయిపోతుందని అక్కడికే క్యూ కడతారు.

ఇటీవల ఓ మహిళ .. తన తండ్రి లులూ మాల్ నుంచి తెచ్చిన మిక్చర్ బాక్స్ లో బల్లి వచ్చిందంటూ వారి బండారాన్ని బయటపెట్టింది. కొంచెం కూడా హైజీన్ మెయింటైన్ చేయడం లేదని, అక్కడ ఎవరూ ఏం కొనొద్దని నెటిజన్లను హెచ్చరిస్తూ ఒక వీడియో చేసింది. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన కూతురికి ఈవెనింగ్ స్నాక్ గా అక్కడి నుంచి కొని తెచ్చిన మిక్చర్ నే కొద్ది కొద్దిగా పెడుతున్నానని, తాజాగా మరోసారి మిక్చర్ ప్లేట్ లో వేసిచ్చేందుకు ఫ్రై అయిన బల్లి కనిపించిందని వాపోయింది. మొదట చూసి కరివేపాకుగా భావించానని, ఎందుకో దాని టెక్స్చర్ సరిగా లేకపోవడంతో అనుమానంతో తీసి చూడగా బల్లి కనిపించిందని విస్తుపోయింది. ఇకపై లులూ మాల్ లో ఎవరూ ఎలాంటి తినుబండారాలు కొనుగోలు చేయవద్దని కోరింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న.. లులూ మార్కెట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story