కాంగ్రెస్ లేకపోతే KCR ఫ్యామిలీకి పుట్టగతులు లేవు.. ఎమ్మెల్సీ అద్దంకి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

అసలు కాంగ్రెస్ (Congress) పార్టీ లేకపోతే కేసీఆర్ (KCR) ఫ్యామిలీకి పుట్టుగతులు కూడా లేవని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) కామెంట్ చేశారు.

కాంగ్రెస్ లేకపోతే KCR ఫ్యామిలీకి పుట్టగతులు లేవు.. ఎమ్మెల్సీ అద్దంకి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అసలు కాంగ్రెస్ (Congress) పార్టీ లేకపోతే కేసీఆర్ (KCR) ఫ్యామిలీకి పుట్టుగతులు కూడా లేవని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) కామెంట్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆంకాంక్షను నెరవేరుస్తూ.. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తును ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. నాడు కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ (TRS)ను విలీనం చేస్తామని చెప్పి దొంగ ప్రకటనలు చేశారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో కవిత (Kavitha), ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ (KTR), కాళేశ్వరం ఉచ్చులో చిక్కుకుని కేసీఆర్ (KCR) కొట్టుమిట్టాడుతున్నాని ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా అవినీతిమయం అయిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే.. ప్రజలు అంత ఆలోచన లేకుండా లేరని.. సరైన సమయంలో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతారని కేటీఆర్‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Next Story