TG: ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలుపు

by Gantepaka Srikanth |

TG: ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలుపు

TG: ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో(Telangana Sarpanch Elections) ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. ఇవాళ మూడో విడత ఎన్నికలు జరిగాయి. తాజాగా ఫలితాలు విడుదల అయ్యాయి. నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం ముసలాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పవిత్ర నాగరాజ్ విజయం సాధించారు. ప్రత్యర్థిపై ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. కాగా, ఈ మూడో విడతలో 182 మండలాల పరిధిలోని 3,752 పంచాయతీల సర్పంచ్‌లకు ఎన్నికలు జరిగాయి. పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఈ మూడో విడతలో ఇప్పటికే 394 మంది సర్పంచ్‌లు, 7,908 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 సర్పంచ్​స్థానాలకు ఒక్కరూ సైతం నామినేషన్​దాఖలు చేయలేదు. 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్​కూడా దాఖలు కాలేదు.

Next Story