- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2034 వరకు సీఎంగా రేవంత్ రెడ్డినే చూస్తారు: మెట్టు సాయికుమార్
కేటీఆర్ ఎన్ని కోతలు కోసినా, సోషల్ మీడియాలో ఎన్ని రాతలు రాసినా అధికారంలోకి రాలేరని, 2034 వరకు సీఎంగా రేవంత్ రెడ్డినే ఉంటారని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, మెట్టు సాయికుమార్ ధీమా వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ ఎన్ని కోతలు కోసినా, సోషల్ మీడియాలో ఎన్ని రాతలు రాసినా అధికారంలోకి రాలేరని, 2034 వరకు సీఎంగా రేవంత్ రెడ్డినే ఉంటారని రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, మెట్టు సాయికుమార్ ధీమా వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు బూతులు మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని, అబద్ధాలలో హరీశ్‌రావు, కేటీఆర్ తో పోటీ పడుతున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ అంటే కోతల రామరావు అని, ఆయన రూ. 2వేల నోటు లాగ దగడగలాడుతారు, కానీ, ఆ నోటు చెల్లదని ఎద్దేవా చేశారు. పది సంవత్సరాలు కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహారించారని, హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అప్పట్లో ప్రయత్నం చేశారని సాయి కుమార్ ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో రక్త బంధం తెలిగిపోయిందని, ఆ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి జపం చేస్తూ పునీతులు అవుతున్నారని మెట్టు సాయి కుమార్ అన్నారు. రైతులకు, దళితులకు, మల్లన్నసాగర్ బాధితులను హింస పెట్టింది కేటీఆర్, హరీశ్ రావులని, బీఆర్ఎస్ నేతల వంకర బుద్ధి మారడం లేదని ఆయన మండిపడ్డారు.






