గోదావరి జలాల ఎత్తిపోతలపై మౌనమెందుకు.. ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్న

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-30 09:39:38  IST  )

రాష్ట్రంలోని మల్లన్న సాగర్‌ (Mallanna Sagar)కు గోదావరి జలాల ఎత్తిపోతలపై రగడ కొనసాగుతోంది.

గోదావరి జలాల ఎత్తిపోతలపై మౌనమెందుకు.. ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని మల్లన్న సాగర్‌ (Mallanna Sagar)కు గోదావరి జలాల ఎత్తిపోతలపై రగడ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే జాగృతి జనం బాట యాత్రలో ఉన్న తెలంగాణ జగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేవారు. మల్లన్న సాగర్‌కు గోదావరి జలాల ఎత్తిపోతలపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న వరద జలాలను మిడ్ మానేరు (Mid Maaneru), లోయర్ మానేరు (Lower Maaneru) గేట్లు ఎత్తి వేల టీఎంసీల నీటిని నదిలోకి నీరు వదులుతున్నారని ఆరోపించారు.

తక్కువ ఖర్చుతో మల్లన్న సాగర్‌ను నింపుకునే అవకాశం ఉన్నా సర్కార్ ఆ ప్రయత్నం చేయడం లేదన్నారు. మిడ్ మానేరు నుంచి అనంతగిరి, రంగనాయక సాగర్ మీదుగా ఎత్తిపోతలపై మౌనముద్రలో రేవంత్‌రెడ్డి ఉన్నారని సెటైర్లు వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో మల్లన్న సాగర్‌కు నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఇప్పుడు తప్పితే తర్వాత రోజుల్లో ఎక్కువ ఖర్చుతో ఎల్లంపల్లి నుంచి నీటిని మిడ్ మానేరుకు, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా నడుచుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. అసంబద్ధ నిర్ణయాలతో ప్రజలపై పెనుభారం పడుతోందని కవిత ఆక్షేపించారు.

READ MORE ....

రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. హరీష్‌రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

Next Story