బీజేపీ అంటే అంత భయమెందుకు.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం

by Kema Shiva Kumar |

కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ (BJP) అంటే అంత భయమెందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు.

బీజేపీ అంటే అంత భయమెందుకు.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ (BJP) అంటే అంత భయమెందుకని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. ఇవాళ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చేవెళ్ల వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ రావును అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే.. బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి తమ వైఫల్యాలను కాంగ్రెస్ కప్పిపుచ్చుకోవాలనుకుంటోందని కామెంట్ చేశారు.

అసలు కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ అంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తలు, కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. అరెస్ట్ చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao)తో పాటు కార్యకర్తలు, కార్పొరేటర్లందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రేవంత్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story