Southern States:ఆన్‌లైన్ షాపింగ్.. చివరి స్థానంలో ఏపీ.. తెలంగాణ ఎన్నో స్థానమంటే?

by Jakkula.Mamatha |

ఆన్‌లైన్ షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినక్కర్లేదు.

Southern States:ఆన్‌లైన్ షాపింగ్.. చివరి స్థానంలో ఏపీ.. తెలంగాణ ఎన్నో స్థానమంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ షాపింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినక్కర్లేదు. పెద్దవారి నుంచి చిన్నవారి వరకు ఆన్‌లైన్ షాపింగ్ గురించి తెలిసిందే. ఈ తరుణంలో ఏ వస్తువు కావలన్న ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో పట్టణంలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆన్‌లైన్‌ షాపింగ్‌ పెరుగుతుంది.

ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో అనేక ఈ-కామర్స్‌(E-Commerce) సంస్థలు, దుకాణదారులు వివిధ రకాల వస్తూత్పత్తులను ఆన్‌లైన్‌(Online)లో ఆర్డర్‌ ఇస్తే ఇంటికి చేర్చుతున్న విషయం తెలిసిందే. దీంతో పల్లే ప్రజలు కూడా తమకు కావాల్సిన వస్తువులు, సరుకులు ఆన్‌లైన్‌లోనే ఆర్ఢర్ పెట్టుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రతి ఏటా పండుగల(Festivals) సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కంపేనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తాయి. దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, ఆషాడం ఈ పండుగలలో పలు కంపెనీలు ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తాయనే విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆన్‌లైన్ షాపింగ్‌లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందో అనే అంశం పై తాజాగా కేంద్ర గణాంకాల శాఖ(Central Statistics Department) సర్వే నిర్వహించింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యలో ‘Comprehensive Modular Survey, Telecom-2025’ పేరుతో ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడించింది.

సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 24.5% కుటుంబాలు ఆన్‌లైన్‌‌లోనే కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో తెలంగాణ(Telangana)లో ఆన్‌లైన్‌లో షాపింగ్(Online shopping) చేసేవారు 35.1% ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో 23.4% శాతంగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత చండీగఢ్, గోవా, దాద్రా-నగర్‌హవేలీలు ఈ విషయంలో టాప్‌లో నిలిచాయి. అక్కడ 50%కి పైగా కుటుంబాలు ఆన్‌లైన్‌లోనే షాపింగ్‌ చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh) చివరి స్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే కుటుంబాలు జాతీయస్థాయి సగటు(16%)తో తెలంగాణ సమానంగా నిలిచిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ 16.6%గా నమోదైనట్లు సర్వేలో వెల్లడించింది.

Next Story