- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులతో చర్చలు ఎందుకు జరపరు.. పీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఈనెల 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే బహింగ సభకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, వీహెచ్, రోహిన్ రెడ్డి, శివసేనా రెడ్డి, ఫహీం ఖురేషీలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని ఫాసిస్ట్ మోడీ పాలనను ఎండగట్టేందుకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిపారు. ప్రెసిడెంట్ ట్రంప్ చెబితేనే.. ప్రధాని మోడీ, అమిత్ షా లాలూచీ పడి పాకిస్థాన్‌తో యుద్ధం ఆపేశారని ఆరోపించారు. మరోవైపు కాల్పుల విరమణకు సిద్ధమని, వెంటనే తమతో కేంద్రం చర్చలు జరపాలంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారని తెలిపారు. ఆపరేషన్ కగార్ నిలిపివేసి, భద్రతా దళాలు సీజ్ ఫైర్ చేసి వారితో ఎందుకు చర్చలు జరపరని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రధాని మోడీ, అమిత్ షాలను ప్రశ్నించారు. జూన్ 4న ఎల్బీ స్టేడియంలో జరగబోయే సభకు గ్రామ శాఖ అధ్యక్షుల నుంచి మండల, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి నేతలు మొత్తం 25 వేల మంది హాజరవుతారని పేర్కొన్నారు. సభకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.






