- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగన్నపేట బ్రిడ్జికి మోక్షమెప్పుడో ?
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు వెళ్లే దారిలో మానేరు వాగు పై లో లెవెల్ వంతెన ఉంది.

దిశ, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు వెళ్లే దారిలో మానేరు వాగు పై లో లెవెల్ వంతెన ఉంది. ఏటా వర్షాకాలంలో అధిక వర్షాలకు మానేరు మత్తడి దుంకడం లో లెవెల్ వంతెన మునిగి పోవడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో హై లెవెల్ వంతెన నిర్మించాలని వివిధ పార్టీల కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకాలు చేశారు. దీంతో అప్పటి మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రూ.10.60 కోట్లను మంజూరు చేశారు. సెప్టెంబర్ లో పనులకు శంకుస్థాపన చేశారు. లో లెవెల్ వంతెన పక్కన పైప్ లైన్ వేసి మట్టి రోడ్డు వేశారు. వంతెనను పూర్తిగా తొలగించారు. తొలగించిన చోట పై వంతెన నిర్మాణానికి పిల్లర్ల కోసం గుంతలు తీశారు. దాదాపు నాలుగు నుంచి ఐదు నెలపాటు పనులు నిలిపివేశారు. తర్వాత పిల్లర్లు మొదలుపెట్టారు. పనులు నత్త నడకన నడవడంతో ప్రజలు రాజకీయ నాయకులను అధికారుల పై మండిపడుతున్నారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎగువ మానేరు 31 ఫీట్లు ఉండగా దాదాపు 26 ఫీట్లు జలాశయంలోకి నీరు చేరుకుంది. ఇంకా 5 ఫీట్లు నిండినట్లయితే ఎగువ మానేరు నీరు ఫ్లో మొదలవుతుంది. దీంతో ఈ మట్టిరోడు ఉంటుందో.. పోతుందో అని ప్రజల ప్రయాణానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని మండిపడుతున్నారు. ప్రస్తుతం పనులు నత నడకన నడుస్తున్నాయి. వర్షాకాలం రావడంతో పక్కన ఉన్న మట్టి రోడ్డు భారీ వరదలు వస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇటూ వంతెన పూర్తికాక అటు మట్టి రోడ్డు కొట్టుకుపోతే రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులకు తిప్పలు తప్పవా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులు వేగవంతం పెంచి హై లెవెల్ వంతెనను పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పక్కన ఉన్న మట్టి రోడ్డును మరమ్మతులు చేయాలని పలువురు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.






