- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: పేదలు చావాల్సిందేనా?: బండి సంజయ్
ప్రభుత్వాసుపత్రుల్లో కుక్క కాటుకు కూడా మందు లేకపోతే ఎట్లా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటుకు కూడా మందు అందుబాటులో లేని దుస్థితి నెలకొందని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘సర్కార్ ఆసుపత్రులకు వచ్చే వాళ్లంతా పేద, మధ్య తరగతి ప్రజలేనని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ చేసుకోలేని వాళ్లేనన్నారు. అలాంటి పేదలు ఆసుపత్రికి వస్తే సూది మందుతోపాటు కనీస సౌకర్యాల్లేక పోతే పేదల పరిస్థితి ఏంది? చావాల్సిందేనా?’’ అని ప్రశ్నించారు. ఇకపై ఇక్కడికి వచ్చే రోగులెవరూ ట్రీట్ మెంట్ కోసం బయటకు వెళ్లే దుస్థితి రానీయొద్దని, అందుకోసం తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన పరికరాలను, సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఈరోజు బండి సంజయ్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఎన్‍ఎండీసీ సంస్థ సహకారంతో సీఎస్సార్ నిధులతో దాదాపు రూ.కోటి విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను జమ్మికుంట ఆసుపత్రికి అందజేశారు. ఇందులో ఈసీజీ మిషన్లు, అల్ట్రాసౌండ్ మిషన్, ఈఎన్టీ సర్జికల్ మైక్రోస్కోప్, మల్టిపుల్ మానిటర్చ మార్చురీ కేబినెట్ సహా మొత్తం 15 రకాల వైద్య పరికరాలను (మెడికల్ ఎక్విప్ మెంట్స్) ఉన్నాయి. ఆ సేవలను ఈరోజు బండి సంజయ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ఇకపై ఒక్క పేషెంట్ కూడా ట్రీట్ మెంట్ కోసం బయటకు వెళ్లే పరిస్థితి రానీయొద్దన్నారు. ఈ ఆసుపత్రికి ఇంకా ఏమేం కావాలో చెప్పాలని అన్ని సౌకర్యాలను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆసుపత్రికి వచ్చే వాళ్లంతా పేదలు, మధ్య తరగతి వాళ్లే. ఆర్ధికంగా లేనివాళ్లే. అట్లాంటి వాళ్లను టెస్టుల్లేవనో, సూది మందు లేదనో ప్రైవేట్ ఆసుపత్రికి పంపి వారిపై భారం మోపొద్దని సూచించారు. పేదలకు సేవ చేయడం మహా భాగ్యం. మానవ సేవే మాధవ సేవ అని గుర్తుంచుకుని సేవలందించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేకనే:
కేంద్ర నిధులతోనే దాదాపు సర్కార్ ఆసుపత్రులన్నీ నడుస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున వస్తున్న నిధులు వస్తున్నాయని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంవల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు, సూది, కాటన్, ఇతర చిన్న చిన్న మెడికల్ పరికరాల కొనుగోలు చేయలేక ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపించారు. వీటిని ద్రుష్టిలో పెట్టుకునే నా పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ ఇబ్బందుల్లేకుండా NMDC సంస్థ సహకారంతో సీఎస్సార్ ఫండ్స్ తో ఈ మెడికల్ ఎక్విప్ మెంట్స్ ను కొనుగోలు చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేస్తామన్నారు. గతంలో దాదాపు 3 కోట్ల రూపాయలకుపైగా నిధులను ఖర్చు చేసి ఎక్స్ రే మిషన్, సీటీ స్కాన్, అంబులెన్సులను కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి అందజేసిన. ఈరోజు వేములవాడతోపాటు హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట సహా ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 4 కోట్ల రూపాయలకుపైగా సీఎస్సార్ నిధులను తీసుకొచ్చి మెడికల్ ఎక్విప్ మెంట్స్ ను అందిస్తున్నా. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.






