NHAI: బెంగళూరు హైవేపై ఇవేం స్పీడ్ లిమిట్స్..? దిశ పేపర్ కథనంపై స్పందించిన ఎన్‌హెచ్ఏఐ ఆర్ఓ

by Ramesh Naini |   (  Updated:2025-09-22 04:33:58  IST  )

బెంగళూరు హైవేపై.. ఇవేం స్పీడ్ లిమిట్స్? అని బుధవారం దిశ పేపర్‌‌లో కథనం వెలువరించింది.

NHAI: బెంగళూరు హైవేపై ఇవేం స్పీడ్ లిమిట్స్..? దిశ పేపర్ కథనంపై స్పందించిన ఎన్‌హెచ్ఏఐ ఆర్ఓ
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరు హైవేపై.. ఇవేం స్పీడ్ లిమిట్స్? అని బుధవారం దిశ పేపర్‌‌లో కథనం వెలువరించింది. (Hyderabad-Bangalore Highway) హైదరాబాద్ -బెంగళూరు హైవేపై శంషాబాద్ నుంచి వెళ్తున్న మార్గంలో జడ్చర్ల వరకు హైవేపై ఉన్న స్పీడ్ లిమిట్ బోర్డులను చూసి వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారని దిశ పేపర్‌లో ప్రచూరితం అయింది. దీనిపై (NHAI RO Hyderabad) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్, హైదరాబాద్ @nhairohyd గురువారం ఎక్స్ వేదికగా స్పందించింది. మీ ఆందోళనను మేము అర్థం చేసుకున్నామని తెలిపింది. సాధారణంగా 4-లైన్ హైవేలు గంటకు 100 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా నిర్మించబడతాయి.. అయితే, రహదారి వినియోగదారుల భద్రత దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో వేగ పరిమితులను తగ్గించడం జరుగుతోందని తెలిపింది.

ప్రత్యేకించి రోడ్డు భద్రత దృష్ట్యా బ్లాక్‌స్పాట్లు, మలుపులు, మీడియన్ ఓపెనింగ్స్, ఫ్లైఓవర్లు, రాంపులు వంటి ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించేందుకు వేగాన్ని నియంత్రిస్తూ గంటకు 80, 60, 40 కిలోమీటర్ల గల పరిమితులను అమలు చేస్తున్నారని వివరించింది. ఈ వేగం సూచిక బోర్డులు దగ్గరగా ఉన్నట్లుగా అనిపించినా.. ఇవన్నీ రోడ్డు భద్రతా పరిశీలనల ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయని స్పష్టం చేసింది. డ్రైవర్లను ముందుగానే అప్రమత్తం చేసి ప్రమాదాలను నివారించడమే లక్ష్యం అని క్లారిటీ ఇచ్చింది. రహదారి ప్రయాణికుల భద్రత మాకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత అని వెల్లడించింది.

కాగా, హైదరాబాద్ -బెంగళూరు హైవేపై శంషాబాద్ నుంచి వెళ్తున్న మార్గంలో జడ్చర్ల వరకు హైవేపై ఉన్న స్పీడ్ లిమిట్ బోర్డులను చూసి వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారని బుధవారం దిశ పేపర్‌ డైనమిక్‌లో కథనం ప్రచూరితం అయింది. 60 కిలో మీటర్ల వేగంతో ఉన్న స్పీడ్ లిమిట్ బోర్డులు పది అడుగుల దూరం దాటేలోపే 40 కిలోమీటర్ల వేగంతో అలర్ట్ బోర్డులు దర్శనమిచ్చాయి. వాహనాల వేగం పెంచడం కోసమే హైవేల నిర్మాణం చేపడుతుండగా ఇలా ఇంత దారుణంగా వేగ పరిమితి తగ్గించడం ఏంటని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల తీరుపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పది అడుగుల్లోనే అంత వేగాన్ని నియంత్రించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

Next Story