వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌

by Muthe.Rajitha |

హైదరాబాద్ నగర వ్యాప్తంగా వీకెంట్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేపట్టారు.

వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగర వ్యాప్తంగా వీకెంట్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేపట్టారు. హైదరాబాద్ , సైబారాబాద్ కమిషనరెట్ల పరిధిలో అధికం సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెండు రోజుల పాటు చెపట్టిన తనిఖీలలో 552 కేసులు నమోదు చేశారు. 438 టూ వీలర్ రైడర్స్ , 45 ఆటోలు, 69 కార్ల పై కేసులు నమోదు చేశారు. సైబారాబాద్ పరిధిలో 431 కేసులు నమోదయ్యాయి. 325 టూ వీలర్ రైడర్స్, 16 ఆటోలు, 86 కార్లు, 4 భారీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. గత వారం చేపట్టిన తనిఖీలలో 320 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులో పరిష్కరించబడ్డాయి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.

264 మందికి జరిమానా, 35 మందికి జరిమానా తో పాటు సోషల్‌ సర్వీస్, 21 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడినట్లు ట్రాఫిక్‌ పోలీస్ అధికారులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటం తీవ్రమైన నేరమని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్‌ 105 ప్రకారం కల్పబుల్‌ హోమిసైడ్‌ నాట్‌ అమౌంటింగ్‌ టు మర్డర్‌ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కోన్నారు.

Next Story