Weather Report: తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు

by Ramesh Goud |

తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Report: తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. ఈ నేపధ్యంలోనే మరో ఐదు రోజులు వర్షాలు కురుసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి, మేఘావృతమైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపై నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి.

Next Story