- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Weather: రాష్ట్రంలో మూడు రోజులు పొడి వాతావరణం.. అక్కడక్కడ జల్లులు
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో ఎపిలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఇటు తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు , రేపు (బుధ, గురు వారాలలో) పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా తూర్పు , ఈశాన్య దిశల నుండి ఈదురు గాలులు వీస్తాయని, దీంతో పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రెండు మూడు రోజులు అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గుర్తించ స్థాయికి పడిపోతాయని హెచ్చరించింది. ఈ తీవ్ర అల్పపీడన వ్యవస్థ రాగల 24 గంటలలో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీలంక-తమిళనాడు తీరం వైపునకు చేరుకునే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది.






