- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కానిస్టేబుళ్ల కుటుంబాలను ఆదుకుంటాం.. మంత్రి పొన్నం భరోసా
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మరణించిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మరణించిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇంత చిన్న వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆ కానిస్టేబుల్స్ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయారని వారికి ఆ దేవుడి ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు. వారి కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతులకు తన సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు, గాడిచర్ల పల్లి గ్రామాలకు చెందిన వెంకటేశ్, పరందాములు దౌల్తాబాద్, రాయాపోల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్‌లో జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా గజ్వేల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు కానిస్టేబుల్‌లు అక్కడికక్కడే మరణించారు.






