హరీష్ రావుకు సపోర్ట్ చేస్తాం.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
హరీష్ రావుకు సపోర్ట్ చేస్తాం.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్‌కు వెన్ను పోటు పొడిచేలా ఉన్నాయన్నారు. సీఎం అయ్యే ప్లాన్‌లో హరీష్ రావు ఉన్నట్టున్నాడు అని అన్నారు. కేసీఆర్‌ను వ్యతిరేకించి వస్తే అందుకు సపోర్ట్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కవిత, హరీష్, కేటీఆర్‌ల పేర్ల మీద విడిపోతుంది. అప్పుడు నాలుగు పార్టీలు అవుతాయని సెటైర్లు వేశారు. హరీష్ రావు పార్టీలో ఉంటే సీఎం కాలేడు.. బీఆరెస్‌ఎల్పీ లీడర్ కూడా కాలేడన్నారు. ఆయన 20 మందితో ఆ పార్టీ లీడర్ కావాలన్నారు. కేసీఆర్ కట్టే పట్టుకొని తిరుగుతున్నాడు.. 60 కిలోలు ఉన్న వ్యక్తి పులి అయితే... 86 కిలోలు ఉన్న నేనేం కావాలన్నారు. ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీదే అధికారం అని జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed