ఏంటీ ఈ వయసులో మళ్లీ పెళ్లా.. 80 ఏళ్ల తాత ముచ్చట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by Disha Web Desk 8 |
ఏంటీ ఈ వయసులో మళ్లీ పెళ్లా.. 80 ఏళ్ల తాత ముచ్చట చూస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి అంటే మూడు ముళ్లు, ఏడు అడుగులు. చాలా మంది 18 నుంచి 30 లోపు ఉన్నవారు పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ తాత ట్రెండ్ సెట్ చేస్తానంటూ ఏకంగా 80 ఏళ్లలో పెళ్లాడి తెగ సంబరపడిపోతున్నాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో 70 సంవత్సరాలు గల అవ్వను,80 సంవత్సరాలు గల తాతకు ఇచ్చి పెళ్లి చేశారు. పట్టు వస్త్రాలు, వేద మంత్రాల సాక్షిగా, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే వారికి ఈ వివాహం జరిపించడానికి కూడా ఒక కారణం ఉన్నదంట. గుగులోతు లాలమ్మ 70, సమీడా నాయక్ 80 దంపతులకు సుమారు 70 ఏళ్ల క్రితం గాంధర్వ వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా, వీరందరూ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరందరూ కలిసి మెలిసి ఉంటారు. అందుకే వారు తమ అవ్వ,తాతల పెళ్లిని కళ్లారా చూడాలి అనుకొని తమ మనవడి పుట్టిన రోజునే ముహుర్తం ఫిక్స్ చేయించి వివాహం జరిపించారు. తమ కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్ల మధ్య ఎంతో ఘనంగా వీరి వివాహం జరిగింది. ఇక ఇది చూసిన కొందరు, ఏంటీ ఈ వయసులో మళ్లీ పెళ్లా.. తాత ముచ్చట భలే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఈ కాలంలో ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటూ.. ఇలా వేడుక జరిపించడం గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story